పాల సేకరణ :
70 నుండి 90 రోజుల వయసున్న కాయకు పొడువునా 4 వైపుల 3 మి.మీ. లోతు వుండేలాగా పదునైన వెదురు పుల్లతో గాటు పెట్టాలి. ఉదయం 8-9 గంటల లోపు చేయాలి. కొబ్బరి చిప్పలలోగని, అల్యూమినియం లేదా గాజు పాత్రల్లో ఈ కారే పాలను సేకరించాలి. ఒక కయనుండి 4 రోజుల వ్యవధిలో 4 సార్లు సేకరించి, లీటరు పాలకు 0.5 శాతము పోటాషియం మెటాబైసల్ఫేట్ ను కలిపి 38°సెల్సియస్ కన్నా తక్కవ వున్న ఎండలో శుభ్రంగా ఆరబెట్టాలి. పాలని పొరలు పొరలుగా వచ్చే వరకు ఆరనిచ్చి మెత్తని పొడిగా చెయ్యాలి. దీనిని పాలిథిన్ సంచుల్లో నిలవచేసుకోవచ్చు. జూలై –ఆగష్టు నెలల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కో-2, కో-5 రకాలు ‘పపెయిన్’ తెయటానికి అనువైనవి. ఒక మొక్కనుండి సంవత్సరానికి 500-700 గ్రా. ఎండు పపెయిన్ లభ్యమవుతుంది.